‘గో బ్యాక్ టు బుక్స్’.. మొబైల్ లైబ్రరీ స్లోగన్

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ సొసైటీలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ మ్యాగ్జిమమ్ టైమ్ సోషల్ మీడియాలో ఎంగేజ్ అవుతున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ఇంటర్నెట్ యాప్స్‌లోనే బోలెడంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ విషయాన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్స్, డెస్క్ టాప్స్ ద్వారానే తెలుసుకుంటూ బుక్ రీడింగ్ మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు టెకీస్.. ‘గో బ్యాక్ టు బుక్స్, లెట్స్ రీడ్ ఇండియా’ అనే నినాదాలతో ఓ […]

Update: 2021-04-06 02:44 GMT

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ సొసైటీలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ మ్యాగ్జిమమ్ టైమ్ సోషల్ మీడియాలో ఎంగేజ్ అవుతున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ఇంటర్నెట్ యాప్స్‌లోనే బోలెడంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ విషయాన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్స్, డెస్క్ టాప్స్ ద్వారానే తెలుసుకుంటూ బుక్ రీడింగ్ మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు టెకీస్.. ‘గో బ్యాక్ టు బుక్స్, లెట్స్ రీడ్ ఇండియా’ అనే నినాదాలతో ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ, పుస్తకాల ద్వారా జ్ఞానం లభిస్తుందని తెలపడమే తమ ఉద్దేశమని క్యాంపెయిన్ ఫౌండర్స్‌లో ఒకరైన ప్రఫుల్లా వాంఖడే చెబుతున్నాడు.

డిజిటల్ ఎరా ఎంట్రీతో పాటు విరివిగా పెరిగిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ప్రజెంట్ జనరేషన్ ‘బుక్ సంస్కృతిని మరిచిపోయి, ఓన్లీ లుక్ సంస్కృతి’ని అలవాటు చేసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. ఈ కల్చర్‌ను మార్చి బుక్ రీడింగ్ హ్యాబిట్‌ను మళ్లీ అలవరిచేందుకు ‘లెట్స్ రీడ్ ఇండియా’ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఫౌండేషన్ సభ్యులైన ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజినీర్స్ ఈ క్యాంపెయిన్‌ను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో చేయాలనుకున్నారు. కానీ కొవిడ్ ప్రభావం వల్ల ప్రస్తుతం మహారాష్ట్రకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా తమ క్యాంపెయిన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపిన ఫౌండేషన్ సభ్యులు.. మొత్తం 10 లక్షల విభిన్న పుస్తకాలను మొబైల్ లైబ్రరీ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ వ్యాన్స్ ద్వారా ఈ పుస్తకాలను అందరికీ అందజేస్తారు కానీ ఇందుకోసం ఒక షరతు విధించారు. అదేంటంటే.. తీసుకున్న పుస్తకాన్ని వారంరోజుల్లో రిటర్న్ చేయడంతో పాటు 300 పదాలతో దానిపై రివ్యూ ఇవ్వాలి. అలా ఇస్తే ఇంకో పుస్తకం మరో వారానికి ఇస్తారు.

బుక్స్ కోసం తమ సోషల్ మీడియా అకౌంట్, వెబ్‌సైట్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చని చెప్పిన లెట్స్ రీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు.. త్వరలోనే ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఫేమస్ ఆథర్స్ స్పీచ్‌లతో పాటు ఇంటర్వ్యూలను అందులో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే ఓన్లీ బుక్స్ ఆఫర్ చేయడం మాత్రమే తమ ఉద్దేశం కాదని, ఈ బుక్స్ ద్వారా అకడమిక్, ప్రొఫెషనల్ లైఫ్‌లో చేంజెస్ తీసుకురావడం తమ అంతిమ లక్ష్యమని ఫౌండేషన్ ఫౌండర్ వాంఖడే చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News