మొబైల్ ఫిష్ ఔట్‌లెట్‌లు ప్రారంభం
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో మొబైల్ ఫిష్ ఔట్‌లెట్లను శుక్రవారం మంత్రి తలసాని ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడాలేనివిధంగా […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో మొబైల్ ఫిష్ ఔట్‌లెట్లను శుక్రవారం మంత్రి తలసాని ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడాలేనివిధంగా మత్స్యకారుల అభివృద్ధికోసం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని తెలిపారు. చేపలు అమ్ముకోవడానికి సబ్సిడీపై వాహనాలు, వలలు, కేట్స్ తదితర పరికరాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మొబైల్ ఫిష్ ఔట్‌లెట్ల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి చేపలు అమ్మడం, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. రాష్ట్రంలో నీటి వనరులున్న ప్రతిచోట చేపపిల్లలు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.