అసెంబ్లీలో ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం జరిగింది. అసెంబ్లీ గేట్ నెంబర్ 8 ని వాణిదేవి కారు ఢీకొట్టింది. వాణిదేవిని శాసన మండలిలో డ్రాప్ చేసి పార్కింగ్ చేస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్‌ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. ఈఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. కారు టైర్ పేలి భారీ శబ్ధం రావడంతో ఒక్కసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు గేటును బలంగా ఢీకొట్టడంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యింది. […]

Update: 2021-03-24 22:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం జరిగింది. అసెంబ్లీ గేట్ నెంబర్ 8 ని వాణిదేవి కారు ఢీకొట్టింది. వాణిదేవిని శాసన మండలిలో డ్రాప్ చేసి పార్కింగ్ చేస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్‌ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. ఈఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. కారు టైర్ పేలి భారీ శబ్ధం రావడంతో ఒక్కసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు గేటును బలంగా ఢీకొట్టడంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్ భాను ప్రకాశ్‌ కారు నడిపినట్టు తెలుస్తోంది. కాగా వాణీదేవి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, గన్ మెన్ భాను ప్రకాష్ కు డ్రైవింగ్ సరిగా రాకపోయినా కారు నడిపినట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంపై నగర సీపీ అంజనీ కుమార్ వెంటనే స్పందించి, చర్యలు తీసుకున్నారు. కారును డ్రైవర్ కాకుండా గన్ మెన్ నడపడంపై సీరియస్ అయ్యారు. వెంటనే కారు ప్రమాదానికి కారణమైన గన్ మెన్ భాను ప్రకాశ్ ను సస్పెండ్ చూస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News