కార్పొరేట్ ఆస్పత్రులు ఏమయ్యాయి?
దిశ, నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వారికి వైద్యం అందించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కడికి పోయాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఎస్‌యూటీఎఫ్ హుజూర్ నగర్, మఠంపల్లి మండల శాఖల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికైనా విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, పోలీసులు, […]
దిశ, నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వారికి వైద్యం అందించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కడికి పోయాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఎస్‌యూటీఎఫ్ హుజూర్ నగర్, మఠంపల్లి మండల శాఖల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికైనా విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు.
Tags: where is corporate hospitals, mlc narsi reddy, govt hospitals, tsutf