కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైటెక్స్‌లోని న్యాక్‌లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్‌వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైటెక్స్‌లోని న్యాక్‌లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్‌వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ‘ధ్యానం’లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున రాబోయే రెండు నెలల పాటు ఉచిత బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు. కొవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్‌వీ సంస్థలను ఆమె అభినందించారు.