ఆ మహానేతకు ‘భారతరత్న’ ఇవ్వాలంటున్న జీవన్ రెడ్డి

దిశ,జగిత్యాల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన సంక్షేమానికి, అభివృద్ధికి స్వర్ణయుగమని.. నేటి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఆద్యుడని, సాగు, తాగు, నీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన అపర భగీరథుడని కొనియాడారు. […]

Update: 2021-07-08 07:01 GMT

దిశ,జగిత్యాల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన సంక్షేమానికి, అభివృద్ధికి స్వర్ణయుగమని.. నేటి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఆద్యుడని, సాగు, తాగు, నీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన అపర భగీరథుడని కొనియాడారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించే విధంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ మరియు ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు ఇతర సంక్షేమ పథకాలతో సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ తెలుగు ప్రజలకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన మహనీయులు వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయన సేవలను గౌరవిస్తూ ‘భారతరత్న’ బిరుదు ప్రదానం చేసి గౌరవించాల్సిందిగా కోరారు. యావత్ తెలుగు ప్రజల తరఫున ఇతర రాష్ట్రాల ఆ ముఖ్యమంత్రులు ఏక కంఠంతో వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించేలా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News