కౌంటింగ్ టేబుళ్ల పెంపు.. 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ టేబుళ్లను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తుండగా.. ఆలస్యమవుతున్న నేపథ్యంలో టేబుళ్ల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టేబుల్ స్థానంలో రెండు టేబుళ్ల చొప్పున ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రాత్రి 8 గంటల సమయానికి 40 మంది […]
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ టేబుళ్లను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తుండగా.. ఆలస్యమవుతున్న నేపథ్యంలో టేబుళ్ల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టేబుల్ స్థానంలో రెండు టేబుళ్ల చొప్పున ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రాత్రి 8 గంటల సమయానికి 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. ఎలిమినేషన్ అయిన 40 మంది అభ్యర్థుల ఓట్ల నుంచి టీఆర్ఎస్కు 163, బీజేపీకి 146, కాంగ్రెస్‌కు 78, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 91 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు చేర్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై 8,038 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)
బీజేపీ–1,04,814
టీఆర్ఎస్–1,12,852
నాగేశ్వర్ –53,701
కాంగ్రెస్– 31,632