ఆయనకు కూడా అక్కడే.. గుడి కట్టించాలట

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని హిందువులంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. దీనిపై తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. శ్రీరామ చంద్రుడు అందరివాడని, ఒక కుల, మత, ప్రాంతానికి సంబంధించిన వాడు కాదని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిరం శంకస్థాపనకు మద్దతుగా బ్రాడీపేట రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డొక్కా మాణిక్యవరప్రసాద్.. శ్రీరాముడి […]

Update: 2020-08-05 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని హిందువులంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. దీనిపై తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. శ్రీరామ చంద్రుడు అందరివాడని, ఒక కుల, మత, ప్రాంతానికి సంబంధించిన వాడు కాదని ఆయన అన్నారు.

అయోధ్యలో రామమందిరం శంకస్థాపనకు మద్దతుగా బ్రాడీపేట రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డొక్కా మాణిక్యవరప్రసాద్.. శ్రీరాముడి జన్మస్థలంలో గుడి కట్టేందుకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకం అన్నారు. రామమందిరం నిర్మాణంతో ప్రజలకు కరోనా నుండి విముక్తి లభించాలని అన్నారు. ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్టలో రామాలయం నిర్మించిన జాంబవంతుడికి కూడా అక్కడే గుడి కట్టించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News