గీతదాటితే వేటు తప్పదు.. టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ వార్నింగ్
దిశ, భద్రాచలం: ఎంతటివారైనా పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేయాలని, పార్టీ గీతదాటితే వేటు తప్పదని ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్‌లో జరిగే ‘విజయ గర్జన’ సభకు జనసమీకరణ నిమిత్తం శుక్రవారం చర్లలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదవుల కోసం కష్టపడే […]
దిశ, భద్రాచలం: ఎంతటివారైనా పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేయాలని, పార్టీ గీతదాటితే వేటు తప్పదని ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్‌లో జరిగే ‘విజయ గర్జన’ సభకు జనసమీకరణ నిమిత్తం శుక్రవారం చర్లలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదవుల కోసం కష్టపడే నాయకులు పోటీపడటం సహజమని, కమిటీలు పూర్తికాగానే పదవులు వచ్చినవారు, రానివారు అందరూ కలసి పనిచేయాలని సూచించారు. కానీ, చర్లలో అందరూ కలిసి పనిచేయకుండా ఓ అదృశ్యశక్తి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ మాత్రమే ముఖ్యం అన్నారు.
వ్యక్తిగత ప్రతిష్టల కోసం పార్టీకి నష్టం చేయాలని చూస్తే ఎంతటివారైనా క్షమించేది లేదన్నారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. విజయగర్జన సభకు భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్ల ఏఎంసీ చైర్మన్ బుచ్చయ్య, చర్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారావు, కార్యదర్శి శ్రీనివాసయాదవ్, నాయకులు లంకరాజు, సయ్యద్ అజీజ్, లాలయ్య, రాముడు, తాతారావు, అరవింద్, అనిల్, రాజు, వరప్రసాద్, శ్రీనివాసరెడ్డి, రాజబాబు, సీతాపతిరాజు తదితరులు పాల్గొన్నారు.