కేసీఆర్‌కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే
దిశ, మక్తల్ డిసెంబర్ : నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నియోజక వర్గంలో పెండింగ్ వర్క్స్, అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు స్పష్టమైన హామీతోపాటు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తెలిపారు. మక్తల్ నియోజకవర్గానికి మంజూరైన ఫైర్ స్టేషన్ ఏర్పాటు ,150 పడకల ఆసుపత్రి,మహిళ […]
దిశ, మక్తల్ డిసెంబర్ : నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నియోజక వర్గంలో పెండింగ్ వర్క్స్, అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు స్పష్టమైన హామీతోపాటు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తెలిపారు.
మక్తల్ నియోజకవర్గానికి మంజూరైన ఫైర్ స్టేషన్ ఏర్పాటు ,150 పడకల ఆసుపత్రి,మహిళ డిగ్రీ కళాశాల, మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ, బూతుపూర్ రిజర్వాయర్ పరిధిలోముంపుకు గురైన నిర్వాసితులకు పునరావాస ఏర్పాటు, ఆర్ ఆర్ సెంటర్లకు పరిహారం, భారీ వర్షాలకు పాడైన రోడ్ల రిపేరు పనుల పురోగతిపై కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పనుల గురించి సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో వివరాలు సేకరించి ఫైర్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని,మక్తల్ పట్టణంలో 150 పడకల(100 జనరల్ బెడ్స్,50 గైనకాలజీ బెడ్స్) హాస్పిటల్ ఏర్పాటుకు ప్రొసీజర్ సిద్ధం చేయాలని, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. RR సెంటర్ పరిహారాలు, రోడ్ల సమస్యలు, ఇరిగేషన్ వివరాలు సేకరించి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు చిట్టెం సుచరిత ఉన్నారు.