టీఎంసీ నుంచి ఎమ్మెల్యే బహిష్కరణ
దిశ,వెబ్‌డెస్క్: అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వైశాలీ దాల్మీయా బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. బాలీకి చెందిన ఎమ్మెల్యే బైశాలీ…పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నిజాయితీ గల వారికి పార్టీలో స్థానం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ శుక్రవారం సమావేశమైంది. […]
దిశ,వెబ్‌డెస్క్: అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వైశాలీ దాల్మీయా బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. బాలీకి చెందిన ఎమ్మెల్యే బైశాలీ…పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నిజాయితీ గల వారికి పార్టీలో స్థానం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు.
కాగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని సమావేశం అనంతరం కమిటీ సూచించింంది. సీనియర్ నేత రాజీవ్ బెనర్జీ రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆమెను బహిష్కరిస్తు పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.