ఎన్నికల వేళ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు.. ప్రతీ ఇంటికీ వెళ్లి బొట్టు పెట్టి..

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామంలో మండల ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి బొట్టు పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి పార్టీకి అండగా నిలుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు […]

Update: 2021-08-23 04:18 GMT

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామంలో మండల ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి బొట్టు పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి పార్టీకి అండగా నిలుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టును అందిస్తున్నట్టు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

దళిత బంధు పథకం ద్వారా దళితులకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.

 

Tags:    

Similar News