మొత్తం మీకేనా.. మాకు ఏం అయిన మిగిలిస్తారా!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామం తో

Update: 2025-04-15 13:15 GMT
మొత్తం మీకేనా.. మాకు ఏం అయిన మిగిలిస్తారా!
  • whatsapp icon

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామం తో పాటు పలు గ్రామాల్లో, రైతులు కష్టపడి పండించిన ధాన్యం రోడ్లపై ఎండబెడితే కుక్కలు, కోతులు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా కోతులతో సహవాసం వెళ్లదీయక పడరాని పాట్లు పడుతున్నారు. వీటికి తోడు ఊర పందులు రాత్రివేళ ధాన్యం కుప్పలపై చేరి బుక్కుతున్నాయి.

దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట డబ్బులు చేతికొచ్చే సమయంలో కోతులు,పందులు బుక్కుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం లేకపోవడంతో..చాలామంది రైతులు, ఖాళీ ఉన్న రోడ్లపై పోసి ఎండబెడుతున్నారు. రాత్రివేళ ధాన్యం కుప్పల వద్ద ఎవరు కాపలా ఉండకపోవడంతో, కుక్కలు వాటిపై ఆడుకుంటున్నాయి. కోతులను వెళ్లగొట్టేందుకు ధాన్యం రైతులు ప్రయత్నిస్తే..రైతులపై దాడికి దిగుతున్నాయి. వీటికి తోడు ఊర పందులు కూడా బుక్కేందుకు అలవాటు పడడంతో..రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది.

Similar News