TG: సరస్వతీ పుష్కరాలకు వెళ్లబోయే భక్తులకు శుభవార్త
2025 మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleswaram)లో జరగనున్న 'సరస్వతీ పుష్కరాలు'

దిశ, వెబ్‌డెస్క్: 2025 మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleswaram)లో జరగనున్న 'సరస్వతీ పుష్కరాలు'(Saraswati Pushkaralu) కోసం, అందుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు సెక్రటేరియట్‌లో ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు వీటిని ప్రారంభించారు. 'సరస్వతీ పుష్కరాలు' పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విసృతంగా చేపట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో సరస్వతీ పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా అవకాశం మాకు రావడం ఆ భగవంతుడి ఆశీస్సులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వం దేవాదాయ శాఖ సంబంధిత వ్యవహారాలను పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక పలు అంశాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు చెప్పారు. సమ్మక్క - సారక్క జాతర, కొమురవెల్లి కళ్యాణం, భద్రాచలం కళ్యాణం తదితర అన్నీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేసినట్టు వివరించారు. యాదగిరి టెంపుల్‌కు పాలక మండలి చట్ట సవరణ చేపట్టినట్టు చెప్పారు.
అయితే, ఈ సరస్వతీ పుష్కరాలకు రోజుకు 50 వేల నుంచి లక్ష దాకా వస్తారని అంచనా వేస్తున్నట్టు వివరించారు. అక్కడ 17 అడుగుల రాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చలువ పందిళ్ళ, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. వెబ్ సైట్, యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుపుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు పరిచిన ఫ్రీం బస్ పథకం ద్వారా దేవాదాయ శాఖకు లాభం సముకూరినట్టు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తు సంఖ్య టెంపుల్ లకు వస్తున్నట్టు కొండా సురేఖ చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.