ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ద‌త్త‌త గ్రామాల‌పై ప్రేమేది..?

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మానుకోట ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ ద‌త్తత గ్రామాల అభివృద్ధిని గాలికి వ‌దిలేశారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తాను గ్రామాల‌ను ద‌త్తత తీసుకుంటున్నట్లు ప్రక‌టించిన ఎమ్మెల్యే.. ఆ త‌ర్వాత వాటి అభివృద్ధిపై ఏమాత్రం దృష్టిపెట్టక‌పోవ‌డం గమ‌నార్హం. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన అనంత‌రం కేస‌ముద్రం మండ‌లంలోని ఉప్పర‌ప‌ల్లి గ్రామాన్ని ద‌త్తత తీసుకుంటున్నట్లుగా ప్రక‌టించారు. అలాగే 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని మాధ‌వాపురం గ్రామాన్ని ద‌త్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Update: 2021-08-07 21:33 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మానుకోట ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ ద‌త్తత గ్రామాల అభివృద్ధిని గాలికి వ‌దిలేశారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తాను గ్రామాల‌ను ద‌త్తత తీసుకుంటున్నట్లు ప్రక‌టించిన ఎమ్మెల్యే.. ఆ త‌ర్వాత వాటి అభివృద్ధిపై ఏమాత్రం దృష్టిపెట్టక‌పోవ‌డం గమ‌నార్హం. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన అనంత‌రం కేస‌ముద్రం మండ‌లంలోని ఉప్పర‌ప‌ల్లి గ్రామాన్ని ద‌త్తత తీసుకుంటున్నట్లుగా ప్రక‌టించారు. అలాగే 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని మాధ‌వాపురం గ్రామాన్ని ద‌త్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాన‌ని గ్రామ‌స్థుల‌కు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గ్రామాల‌ను ద‌త్తత తీసుకోవ‌డంతో రెండు గ్రామాల జ‌నం మొద‌ట సంతోషంతో త‌బ్బిబ్బయ్యారు. కానీ రోజులు గ‌డిచిన కొద్దీ రాజ‌కీయ అవ‌కాశం కోస‌మే ఈ హామీ త‌మ‌పై విసిరారు అన్న విష‌యం బోధ‌ప‌డిందంటూ ప్రజ‌లు బాధ‌ను వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ రెండు గ్రామాలు కూడా నేటికీ ధైన్యస్థితిలో ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. క‌నీసం రోడ్లు, డ్రెయినేజీ వ్యవ‌స్థ కూడా స‌రిగా లేక‌పోవ‌డం ఎమ్మెల్యే ఈ గ్రామాల‌పై పెట్టిన దృష్టికి నిద‌ర్శన‌మే చెప్పాలి. ఇల్లు, నీళ్లు, ఆసరా పింఛన్లు లేక దత్తత గ్రామాల ప్రజలు విలవిలాడుతున్నారు. దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల పై శ్రద్ధ చూపకపోవడంతో ఆ గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడిఅక్కడే అన్న చందంగా మారింది.

ఏడేండ్లలో ఉప్పర‌ప‌ల్లికి చేసిందేంటి..?

ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏడేళ్ల క్రితం కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామాన్ని ద‌త్తత తీసుకున్నారు. ఈ ఏడేళ్లలో ఎమ్మెల్యే ఈ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా తీసుకున్న చ‌ర్యలు శూన్యమ‌నే చెప్పాలి. ఉప్పర‌ప‌ల్లిలో కొన్ని వాడ‌ల‌కు ఇప్పటికీ సీసీ రోడ్డు నిర్మాణం లేదు. డ్రెయినేజీలు లేక‌పోవ‌డంతో మురుగు నీరు రోడ్లపై పారుతోంది. ఎమ్మెల్యే ద‌త్తత గ్రామం అన‌గానే సంక్షేమంపై అంచ‌నాలుంటాయి. అయితే ఉప్పర‌ప‌ల్లిలో నేటికీ అనేకమంది రేష‌న్ ద‌ర‌ఖాస్తుదారులు, పించ‌న్లకు ద‌ర‌ఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వృద్ధులున్నారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల సంగ‌తి ఊసే లేదు. గ్రామంలో నెల‌కొన్న స‌మ‌స్యల‌పై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా క‌నీస స్పంద‌న క‌రువైంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ మాత్రం దానికి ద‌త్తత ఎందుకు తీసుకోవాలి..? మ‌మ్మల్ని అయనేదో ఆయ‌న ఉద్దరించిన‌ట్లు ప్రగ‌ల్బాలు ఎందుకు ప‌ల‌కాలంటూ స్థానిక జ‌నం బాహాటంగానే విమ‌ర్శల‌కు దిగుతున్నారు.

మ‌ట్టిరోడ్ల మాధ‌వాపురం.. ఆద‌ర్శ గ్రామం..

ఎమ్మెల్యే ద‌త్తత తీసుకున్న మ‌రో గ్రామం మాధ‌వాపురంలో నేటికీ పంచాయ‌తీ భ‌వ‌న‌మే లేదంటే ఆయ‌న చిత్తశుద్ధి ఏంత‌లా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 2019లో ఎన్నిక‌ల‌కు ముందు ఈ గ్రామాన్ని ద‌త్తత తీసుకున్న ఎమ్మెల్యే రెండోసారి విజ‌యం సాధించాకా.. ఈ గ్రామం మొహం కూడా చూడ‌లేదని స్థానికులు వాపోతున్నారు. ఏడేళ్లుగా గ్రామ పంచాయ‌తీ భవనం నిర్మాణం కొన‌సాగుతూనే ఉన్నా… ఎందుకు జాప్యం జ‌రుగుతోంద‌ని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని పాల‌క‌వ‌ర్గం స‌భ్యులే విమ‌ర్శిస్తున్నారు. గ్రామంలో అనేక స‌మ‌స్యలు తాండ‌వం చేస్తున్నాయి. నేటికీ అనేక ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవు. సైడ్ డ్రైనేజ్ లేదు. పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జ‌ర‌గ‌లేదు. సుమారు 10 కాలనీలలో మ‌ట్టిరోడ్లే దిక్కు. సీసీ రోడ్లకు క‌నీసం ప్రతిపాద‌న‌లు కూడా పంప‌లేదు. వర్షాకాలంలో రోడ్లన్నీబురద‌మయంగా మారుతున్నాయి. నేటికి గ్రామంలో సుమారుగా 50 మందికి పైగా ఆస‌రా పింఛ‌న్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. గ్రామ‌స్థుల‌కు 200 ఇళ్లు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేటికి కనీసం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని కూడా గుర్తించ‌క‌పోవ‌డంతో విశేషం.


ఒక్కరోజు కూడా గ్రామానికి రాలేదు

గ‌త ఎన్నికలకు ముందు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రక‌టించిండు. అయితే గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదు. ఏ ఒక్క రోజు కూడా గ్రామ సమస్యలపై దృష్టి పెట్టలేదు. గ్రామంలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. రోడ్లు లేవు. మురికి కాల్వ‌లు లేవు. అనేక మందికి ఫించ‌న్లు రావాలె..కానీ ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేదు.
-మద్ది వెంకట్ రెడ్డి, మాధ‌వ‌పురం గ్రామ‌స్థుడు


ప్రజల సొమ్మును కాజేస్తున్నారు.

గ్రామంలో గ్రామ సర్పంచ్, అతని అనుచరులు కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ అండతో గ్రామ ప్రజల సొమ్మును, ప్రభుత్వ ధనమును దుర్వినియోగం చేస్తున్నారు. చెయ్యని పనులకు చేసినట్టుగా దొంగ రికార్డులతో లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామంలో అవినీతి రాజ్యమేలుతోంది. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి మాధవపురం గ్రామంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న అవినీతిని బయట పెట్టాలి.
-మాధ‌వ‌పురం 6వ వార్డు సభ్యుడు, తిరుపతయ్య


గ్రామాన్ని పట్టించుకునే నాథుడే లేడు

పేరుకే ఆదర్శ గ్రామం, కానీ మాధవాపురం గ్రామం పూర్తిగా సమస్యలతో నిండిపోయింది. పారిశుద్ధ్యం పేరుకుపోవడంతో పాటు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిధుల దుర్వినియోగం చేస్తున్నారు. దత్తత గ్రామాలను పట్టించుకున్న నాథుడే లేడు. రోడ్లు,నీళ్లు,కాలువలు లేవు.అభివృద్ధి కుంటపడుతుంది.
-ఎర్రబెల్లి చంద్రయ్య , మాధ‌వ‌పురం గ్రామస్థుడు

Tags:    

Similar News