మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు.. కోట్లు తీసుకున్నాడన్న సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వాఖ్యలు రోజు రోజుకూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి ప్రెస్ మీట్‎లో మాట్లాడుతూ.. తనకు 600 ఎకరాలు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ ‘‘ మంత్రి మల్లారెడ్డి ‘రైతు బంధు’ పథకం కింద సంవత్సరానికి రూ.60 లక్షలు తీసుకుంటూ.. నాలుగేళ్లలో 2.40 కోట్లు తీసుకున్నారు. ఇలా ప్రజల సొమ్మును ఆదాయంగా తీసుకుని […]

Update: 2021-08-27 07:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వాఖ్యలు రోజు రోజుకూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి ప్రెస్ మీట్‎లో మాట్లాడుతూ.. తనకు 600 ఎకరాలు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ ‘‘ మంత్రి మల్లారెడ్డి ‘రైతు బంధు’ పథకం కింద సంవత్సరానికి రూ.60 లక్షలు తీసుకుంటూ.. నాలుగేళ్లలో 2.40 కోట్లు తీసుకున్నారు. ఇలా ప్రజల సొమ్మును ఆదాయంగా తీసుకుని సంపన్నులకు సీఎం కేసీఆర్ కట్టబెడుతున్నారు. అదే పేదోడి తల్లిదండ్రులకు ఫించన్ ఇవ్వమంటే ఇంట్లో ఒకరికే ఇస్తామంటున్నారు. అదే అటెండర్ ఉద్యోగం ఉన్నా మొత్తానికే ఫించన్‎ను తొలగించారు. కేసీఆర్ పాలన ఎవరికి పన్నీరయ్యింది.. ఎవరకి కన్నీటిని మిగిల్చిందో అర్ధం చేసుకోండి’’ అంటూ వీడియోను ట్వీట్ చేశారు.

https://twitter.com/seethakkaMLA/status/1431118688506167301?s=20

Tags:    

Similar News