ఏపీ పరిస్థితి తలకిందులైంది: అనగాని

దిశ, ఏపీ బ్యూరో: జగన్.. సీఎం కావడంతోనే ఏపీ పరిస్థితి తలకిందులైందని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ​అన్నారు. ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అమరావతి సంపద సృష్టికి పరిశ్రమ లాంటిందని పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన 93మంది రైతులు తనువు చాలించినా జగన్ మనసు చలించలేదన్నారు. అమరావతి బడుగు బలహీన వర్గాలకు చెందినదని చెప్పారు. రాజధానిని దూరం చేసి బలహీన వర్గాలను దెబ్బకొట్టేందుకు జగన్ యత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.5లకు అన్నం […]

Update: 2020-10-11 11:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: జగన్.. సీఎం కావడంతోనే ఏపీ పరిస్థితి తలకిందులైందని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ​అన్నారు. ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అమరావతి సంపద సృష్టికి పరిశ్రమ లాంటిందని పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన 93మంది రైతులు తనువు చాలించినా జగన్ మనసు చలించలేదన్నారు. అమరావతి బడుగు బలహీన వర్గాలకు చెందినదని చెప్పారు. రాజధానిని దూరం చేసి బలహీన వర్గాలను దెబ్బకొట్టేందుకు జగన్ యత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.5లకు అన్నం పెట్టలేనోడు మూడు రాజధానుల కడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 299రోజులుగా శాంతియుత ఉద్యమం జరగడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.

Tags:    

Similar News