ఈ వేదికాకపోతే ఇంకోటి….

దిశ వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఒత్తిడికి ఫేస్‌బుక్ యాజమాన్యం లొంగిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అందుకే తన ఫేస్ బుక్ అకౌంట్ రద్దు చేసిందన్నారు. అయితే దేశ ద్రోహులు, రోహింగ్యాలు,ముస్లింలపై తనకు ఉన్న అభిప్రాయం మారదన్నారు. తన అభిప్రాయాలు పంచుకోవడానికి ఫేస్ బుక్ కాకపోతే మరో వేదిక ను ఎంచుకుంటానన్నారు. అయితే తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల ఫేస్ బుక్ అకౌంట్లను ఆ సంస్థ ఎందుకు బ్లాక్ చేయడం లేదని […]

Update: 2020-09-03 08:57 GMT

దిశ వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఒత్తిడికి ఫేస్‌బుక్ యాజమాన్యం లొంగిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అందుకే తన ఫేస్ బుక్ అకౌంట్ రద్దు చేసిందన్నారు. అయితే దేశ ద్రోహులు, రోహింగ్యాలు,ముస్లింలపై తనకు ఉన్న అభిప్రాయం మారదన్నారు. తన అభిప్రాయాలు పంచుకోవడానికి ఫేస్ బుక్ కాకపోతే మరో వేదిక ను ఎంచుకుంటానన్నారు. అయితే తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల ఫేస్ బుక్ అకౌంట్లను ఆ సంస్థ ఎందుకు బ్లాక్ చేయడం లేదని ప్రశ్నించారు.

కాగా ద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ ను ఆ సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద, విద్వేష పూరిత వ్యాఖ్యల విషయంలో ఫేస్ బుక్ నియమాలను ఎవరైనా పాటించాల్సిందేనని ఫేస్ బుక్ తెలిపింది. కానీ రాజాసింగ్ వాటిని ఉల్లంఘించడంతో ఆయన అకౌంట్ రద్దు చేస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు.

Tags:    

Similar News