రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
దిశ, భద్రాచలం : టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క నివాసంలో పొదెం వీరయ్య రేవంత్‌రెడ్డిని కలిశారు. నూతన టీపీసీసీ కమిటీలో పొదెం వీరయ్యకి ఉపాధ్యక్ష పదవి లభించింది. రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలో పొదెం వీరయ్య వెంట కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్, నాయకులు బలుసు సతీష్ ఉన్నారు.