క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశం.. ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే పెద్ది..

దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గోపి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖ, ఉద్యానవనం, గ్రామీణ అభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, మిషన్ భగీరథ, అటవీ అభివృద్ధి, పట్టాల పంపిణీ, మత్స మరియు పశు సంవర్ధక శాఖ, మున్సిపాలిటి, పంచాయతీ రాజ్, రెవెన్యూ, విద్య, ఎస్సీ ఎస్టీ మరియు బీసీ […]

Update: 2021-12-06 04:05 GMT

దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గోపి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖ, ఉద్యానవనం, గ్రామీణ అభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, మిషన్ భగీరథ, అటవీ అభివృద్ధి, పట్టాల పంపిణీ, మత్స మరియు పశు సంవర్ధక శాఖ, మున్సిపాలిటి, పంచాయతీ రాజ్, రెవెన్యూ, విద్య, ఎస్సీ ఎస్టీ మరియు బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ తదితర శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు.

Tags:    

Similar News