వెంకట్‌పై కేసులు పెట్టకుండా విడుదల చేయాలి

దిశ, సంగారెడ్డి: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాలమురి వెంకట్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్నాడని, ఆయనపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ని కలిసి విద్యార్థుల సమస్యలు చెప్పే అవకాశం లేదు, కనుక ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారని స్పష్టం చేశారు. వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి, విద్యార్థులపై ఎలాంటి […]

Update: 2020-08-12 10:01 GMT

దిశ, సంగారెడ్డి: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాలమురి వెంకట్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్నాడని, ఆయనపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ని కలిసి విద్యార్థుల సమస్యలు చెప్పే అవకాశం లేదు, కనుక ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారని స్పష్టం చేశారు.

వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి, విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేసేలా చూడాలన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉంటూ ఎవరినీ రావివ్వకుండా చేయడం సరికాదన్నారు. వెంకట్ డిమాండ్ చేస్తున్నట్టు డిగ్రీ, పీజీ, యూజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి తగ్గేవరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించిన విద్యార్థులు సరిగా రాయలేరన్నారు. వెంకట్‌కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News