రైతులు అధైర్యపడొద్దు.. అన్ని రకాలుగా ఆదుకుంటాం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వర్షం వల్ల నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, వారిని అని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నీట మునిగింది. బుధవారం గద్వాల నియోజకవర్గంలోని ధారూర్, కె.టీ దొడ్డి మండలంలోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో వర్షపు నీరు చేరకుండా యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వర్షం వల్ల నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, వారిని అని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నీట మునిగింది. బుధవారం గద్వాల నియోజకవర్గంలోని ధారూర్, కె.టీ దొడ్డి మండలంలోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో వర్షపు నీరు చేరకుండా యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ… నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో భారీవర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమని, నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునే అన్ని అవకాశాలనూ పరిశీలించి రైతులను ఆదుకుంటామని అన్నారు. నీటి మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.