గౌడన్నలకు అండగా ఉంటా.. పరకాల ఎమ్మెల్యే చల్లా హామీ
దిశ, పరకాల/ఆత్మకూర్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జీవనోపాధి కోల్పోతున్న గౌడన్నలకు అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామ శివారులో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడన్నలను ఎమ్మెల్యే కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి 54 కుటుంబాలు జీవిస్తున్నాయని, రోడ్డు విస్తరణలో సుమారు 500 వరకు తాటిచెట్లు పోతున్నాయని తెలిపారు. దీంతో జీవనోపాధిపై భారీ దెబ్బపడే అవకాశం ఉందని గౌడ కులస్తులు […]
దిశ, పరకాల/ఆత్మకూర్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జీవనోపాధి కోల్పోతున్న గౌడన్నలకు అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామ శివారులో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడన్నలను ఎమ్మెల్యే కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి 54 కుటుంబాలు జీవిస్తున్నాయని, రోడ్డు విస్తరణలో సుమారు 500 వరకు తాటిచెట్లు పోతున్నాయని తెలిపారు. దీంతో జీవనోపాధిపై భారీ దెబ్బపడే అవకాశం ఉందని గౌడ కులస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోతున్న గౌడన్నల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతరించి పోతున్న కుల వృత్తులను కాపాడాలని, వారిని ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.