‘దయచేసి నన్ను గెలిపించండి… దోచుకుంటా’
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో అసెంబ్లీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు ప్రచారాలు చేస్తూ… ఊపు పెంచారు. తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆయన ప్రచారం చూసి స్థానికులతో పాటు మీడియా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ‘నా పేరు రాజేంద్ర ప్రసాద్. నలందా జిల్లా బర్బీఘా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సేవ చేయాలని నాకు […]
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో అసెంబ్లీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు ప్రచారాలు చేస్తూ… ఊపు పెంచారు. తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆయన ప్రచారం చూసి స్థానికులతో పాటు మీడియా కూడా ఒక్కసారిగా షాక్ అయింది.
‘నా పేరు రాజేంద్ర ప్రసాద్. నలందా జిల్లా బర్బీఘా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సేవ చేయాలని నాకు లేదు. ఇంతకాలం పాటు దర్జీగా పనిచేస్తూ జీవనం సాగించా. ఏమీ సంపాదించలేకపోయా. ఎప్పటికైనా కోటీశ్వరుడిని కావాలనేది నా కల. అందుకు రాజకీయం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నా. అభివృద్ధి పేరిట దోపిడీ చేసి కొంత డబ్బు సంపాదించుకుంటా. దయచేసి నాకు ఓట్లేసి గెలిపించండి. నా మీద ఇప్పటికే పోలీస్ స్టేషన్లో రెండు కేసులున్నాయి. మొదటిది భూవివాదం కేసు రెండోది అత్యాచారం కేసు. రాజకీయాల్లోకి రావాలంటే ఇవే అర్హతలు’ అంటూ వినూత్న శైలిలో రాజేంద్ర ప్రసాద్ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నాడు.
అతడి ప్రచార శైలి చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజకీయాల్లో అవినీతి అక్రమాలు ఎలా పెరగిపోయాయో చెప్పేందుకు రాజేంద్రప్రసాద్ ఈ తరహా ప్రచారం చేస్తున్నారా? మరేదైనా ఇతర కారణం ఉన్నదా.. అని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమన్నా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగంగా తాను దోచుకోవడానికే వచ్చాను.. ఓట్లేయండి అని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి.