ఆసుపత్రుల్లో బెడ్స్ ఫుల్.. వసతులు లేవు.. సర్కార్‌పై అక్బరుద్దీన్ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : నిలోఫర్ హాస్పిటల్‌లో వైరల్ ఫీవర్‌లు, శ్వాసకోశ సమస్యలతో బెడ్స్ అన్నీ నిండిపోయాయని ఎంఐఎం లేజిస్లేటివ్ ప్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. వీరికి మందులు, మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. స్టాప్ కొరతతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని వివరించారు. దీంతో ఎంతో మంది పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని అన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెస్పిరేటరీ మెషిన్లు, డెంగీ టెస్టింగ్ కిట్లు లేక ఆసుపత్రులు అస్తవ్యస్తంగా మారాయని […]

Update: 2021-10-04 05:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిలోఫర్ హాస్పిటల్‌లో వైరల్ ఫీవర్‌లు, శ్వాసకోశ సమస్యలతో బెడ్స్ అన్నీ నిండిపోయాయని ఎంఐఎం లేజిస్లేటివ్ ప్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. వీరికి మందులు, మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. స్టాప్ కొరతతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని వివరించారు. దీంతో ఎంతో మంది పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని అన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెస్పిరేటరీ మెషిన్లు, డెంగీ టెస్టింగ్ కిట్లు లేక ఆసుపత్రులు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు.

నిలోఫర్‌తోపాటు ఫీవర్ ఆసుపత్రిలోనూ ఇదే దుస్థితి నెలకొందని వివరించారు. పీ‌హెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు కేవలం కరోనా వ్యాక్సిన్, టెస్టింగ్‌లకే పరిమితమయ్యాయని తెలిపారు. దీంతో ఎంతోమంది బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ అంటే ఆ ఆసుపత్రులు కూడా అడ్మిట్ చేసుకోవడం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు రాలేదని, దీంతో కొత్త పేషెంట్లను నేర్చుకోబోమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బకాయిలను విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో తేలిన డీ 2 వేరియంట్ కరోనా మన రాష్ట్రంలోనూ ఉన్నట్లు అనుమానం కలుగుతోందని అన్నారు. చాలా మందికి లాంగ్ టైంలో ఫీవర్‌తో పాటు శ్వాస సమస్యలు ఉన్నాయని, ఇది డీ 2 వేరియంట్‌కి ప్రధాన లక్షణమని చెప్పుకొచ్చారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఆసుపత్రులు విజిట్ చేయండి..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను విజిట్ చేస్తే క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుస్తాయని అక్బరుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల్లో పేషెంట్స్ క్యూ కడుతున్నారని చెప్పారు. అధికారులతో పాటు మంత్రులూ ఆసుపత్రులను విజిట్ చేయాలని కోరారు. ఆసుపత్రుల విజిట్‌కు సమయం నిర్ణయిస్తే తానూ కూడా మంత్రులతో వస్తానని అన్నారు.

 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..