ఫస్ట్ భార్య పిల్లలతో సహా రెండో భార్య మిస్సింగ్
దిశ, చార్మినార్: సోదరి కూతురు వివాహానికి వెళ్లొస్తానని భార్య, కుమారుడు, కుమార్తె అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హాషామాబాద్కు చెందిన మహ్మద్ అశ్వాక్ హస్సేన్ పాన్ షాప్ నిర్వాహకుడు. మహ్మద్ అశ్వాక్.. షహనాజ్ బేగం(48)ను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే, ఇతనికి ఇదివరకే పెళ్లియ్యింది. ఒక కూతురు అంజుమ్ఐరా(12), కుమారుడు మహ్మద్ అక్బర్(14) ఉన్నాడు. ఈ నెల 23న జీఎం కాలనీలో సోదరి కూతురు వివాహానికని […]
దిశ, చార్మినార్: సోదరి కూతురు వివాహానికి వెళ్లొస్తానని భార్య, కుమారుడు, కుమార్తె అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హాషామాబాద్కు చెందిన మహ్మద్ అశ్వాక్ హస్సేన్ పాన్ షాప్ నిర్వాహకుడు. మహ్మద్ అశ్వాక్.. షహనాజ్ బేగం(48)ను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే, ఇతనికి ఇదివరకే పెళ్లియ్యింది. ఒక కూతురు అంజుమ్ఐరా(12), కుమారుడు మహ్మద్ అక్బర్(14) ఉన్నాడు. ఈ నెల 23న జీఎం కాలనీలో సోదరి కూతురు వివాహానికని షహనాజ్బేగం.. కూతురు అంజుమ్ఐరా, కుమారుడు మహ్మద్ అక్బర్ లను తీసుకుని వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో భర్త మహ్మద్ అశ్వాక్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.