రాత్రి పడుకున్న వ్యక్తి తెల్లారేసరికి శవంగా మారాడు

మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామానికి చెందిన భూక్య నరసింహ( 55 ) టీబీ వ్యాధితో బాధపడుతూ మనస్థాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరివేసుకొని చనిపోయాడు.

Update: 2025-03-23 11:32 GMT
రాత్రి పడుకున్న వ్యక్తి  తెల్లారేసరికి శవంగా మారాడు
  • whatsapp icon

దిశ, చిట్యాల : మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామానికి చెందిన భూక్య నరసింహ( 55 ) టీబీ వ్యాధితో బాధపడుతూ మనస్థాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి భూక్య విమలతో 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. గత నాలుగు సంవత్సరాలుగా నరసింహ టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు.

     శనివారం మృతుడి భార్య కూలి పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా మృతుడు దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఏమి జరిగిందని భార్య అడగగా తనకు రెండు రోజుల నుండి ఒంట్లో బాగోలేదని, తాను బతికి ఎవరికి ఉపయోగం అని అన్నాడు. దాంతో రేపు ఆసుపత్రికి వెళ్దామని భార్య చెప్పింది. అనంతరం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం లేచి చూడగా ఇంటి ముందున్న వేప చెట్టుకు చీరతో ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. భార్య విమల ఫిర్యాదు మేరకు ఎస్సై జి.శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  


Similar News