జీవితంపై విరక్తి చెంది యువకుడు సూసైడ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కలగండి గ్రామానికి చెందిన కొండ్రు శివ (19) జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కొండ్రు సీతారాముల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.