ఇంటి నుంచి రాకపోయినా అతను బతికేవాడేమో ?
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

దిశ, కోదాడ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా ధోనకల్లు గ్రామానికి చెందిన కొత్తపల్లి సైదులు (31) బోర్వెల్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. కోదాడలో బోర్ వెల్ డ్రైవర్ గా పని చేసేందుకు వీరయ్య అనే వ్యక్తి సైదులుని బుధవారం తీసుకొచ్చాడు.
అనంతరం గురువారం సైదులుకు సీరియస్ గా ఉంది అని ఆయన బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. బంధువులు వచ్చేలోగా మృతి చెంది ఉన్నాడు. దాంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై మృతుని భార్య కొత్తపల్లి నాగమణి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.