అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి

         ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడి జరిగింది. కిర్కక్ ప్రావిన్సులోని కే1 అమెరికా సైనిక స్థావరంపై గురువారం రాత్రి కత్యుషా క్షిపణులు విరుచుకుపడినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వెలుబడ్డాయి. అయితే ఈ రాకెట్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. గత డిసెంబర్ 27 తరువాత ఈ స్థావరంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీ మరణంతో 40 రోజుల సంతాప దినాలు ముగుస్తుండడంతో ఈ […]

Update: 2020-02-13 23:46 GMT

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్ దాడి జరిగింది. కిర్కక్ ప్రావిన్సులోని కే1 అమెరికా సైనిక స్థావరంపై గురువారం రాత్రి కత్యుషా క్షిపణులు విరుచుకుపడినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వెలుబడ్డాయి. అయితే ఈ రాకెట్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. గత డిసెంబర్ 27 తరువాత ఈ స్థావరంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీ మరణంతో 40 రోజుల సంతాప దినాలు ముగుస్తుండడంతో ఈ దాడులు జరగడం గమనార్హం.

Tags:    

Similar News