హత్యకు ఆదర్శం మీర్జాపూర్?

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. వాటి సంగతి పక్కన పెడితే, సినిమాల ద్వారా ఇన్‌స్పైర్ అయి సమాజంలో అమలు చేసే ఘటనలే ఎక్కువ. ముఖ్యంగా చెడును ఫాలో అయ్యేందుకు మాత్రం రెడీగా ఉంటారు. అందుకే ‘సినీ ఫక్కీలో దొంగతనం, సినీ ఫక్కీలో కిడ్నాప్, సినీ ఫక్కీలో అత్యాచారం’ అని హెడ్డింగులు కనిపిస్తాయి. కానీ సినీ ఫక్కీలో ఏదైనా మంచి చేశారని కనిపించే హెడ్డింగులు చాలా అరుదు. అయితే ఇటీవల హర్యానాలో […]

Update: 2020-11-04 05:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. వాటి సంగతి పక్కన పెడితే, సినిమాల ద్వారా ఇన్‌స్పైర్ అయి సమాజంలో అమలు చేసే ఘటనలే ఎక్కువ. ముఖ్యంగా చెడును ఫాలో అయ్యేందుకు మాత్రం రెడీగా ఉంటారు. అందుకే ‘సినీ ఫక్కీలో దొంగతనం, సినీ ఫక్కీలో కిడ్నాప్, సినీ ఫక్కీలో అత్యాచారం’ అని హెడ్డింగులు కనిపిస్తాయి. కానీ సినీ ఫక్కీలో ఏదైనా మంచి చేశారని కనిపించే హెడ్డింగులు చాలా అరుదు. అయితే ఇటీవల హర్యానాలో పట్టపగలే జరిగిన మర్డర్‌కు కూడా ఇప్పుడు సినిమా రంగు అంటుకుంది. పాయింట్ బ్లాక్‌లో నికిత తోమర్‌ను కాల్చడం అనేది తాను మీర్జాపూర్ సిరీస్ మొదటి సీజన్‌లో మున్నా పాత్రను ఆదర్శంగా తీసుకుని చేసినట్లు తుపాకీ కాల్చిన తౌసిఫ్ పోలీసుల వద్ద అంగీకరించాడు.

మొదటి సీజన్ చివరి ఎపిసోడ్‌లో మున్నా తను ప్రేమించిన అమ్మాయి, తన ప్రేమను కాదనడంతో ఆమెను పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపుతాడు, ఇటీవల విడుదలైన రెండో సీజన్‌లో అమ్మాయిని ఎందుకు చంపావని అడిగితే, ప్రేమించాను కాబట్టి చంపేశాను అంటాడు. మీర్జాపూర్ సిరీస్‌లో మున్నా కేరెక్టర్ హర్యానా, బిహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి నగరాల్లో ఎంతో మంది యువతకు చేరువైన కేరక్టర్. అలాగే ఆ కేరెక్టర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫన్నీ కేరెక్టర్. దీంతో ఎక్కువ మంది ఫన్‌ను ఎంజాయ్ చేస్తారని నమ్మకం లేదు, కొంతమంది ఆ నెగెటివిటీని కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే ఒక సినిమా లేదా సీరియల్ నుంచి ఏది ఆదర్శంగా తీసుకోవాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ఆ మాత్రం దానికి ఆయా సినిమాలు, సీరియళ్ల నిర్మాతలను, దర్శకులను తప్పుబట్టడం ఎంతమాత్రం సబబు కాదు. ఇదే విషయం గురించి మున్నా పాత్ర పోషించిన దివ్యేందు శర్మ స్పందించారు. పూర్తిగా వినోదం కోసం రూపొందించిన ఒక సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమని, అసలు సినిమాలో చెడును ఎందుకు చూడాలని, దాన్ని చూసి ఆనందించి, వదిలేసే తత్వం సమాజం అలవాటు చేసుకుంటే మంచిదని దివ్యేందు బాధపడ్డారు. ఏదేమైనా పోయిన అమ్మాయి ప్రాణం తిరిగి రాదు కదా.. ఇందుకు సినిమా తీసిన వారిని కాకుండా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లదే వంద శాతం తప్పు అనే విషయం సమాజం గుర్తుంచుకోవాలి. మున్నాలాగ ప్రేమించిన అమ్మాయిని చంపాలి అని కాకుండా ప్రేమించిన అమ్మాయికి ఎన్నటికీ మున్నాలాగ ద్రోహం చేయకూడదని తౌసిఫ్ అనుకుంటే నేడు నికిత తోమర్ ప్రాణాలతో ఉండేది.

Tags:    

Similar News