కోరిక తీర్చలేదని మైనర్ బాలిక హత్య
దిశ, వెబ్డెస్క్: తన కోరిక తీర్చనందుకు ఓ ప్రబద్దుడు దారుణానికి ఒడిగట్టాడు. కామంతో మైనర్ బాలిక అని చూడకుండా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అడ్డు చెప్పిందని హత్య చేసి పరారీ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనం రేపుతోంది. ఉత్తర ప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా సిక్రీ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన అశోక్(30) స్థానికంగానే నివాసం ఉండే 8 ఏండ్ల బాలికను మంగళవారం రాత్రి దగ్గరకు పిలిచాడు. […]
దిశ, వెబ్డెస్క్: తన కోరిక తీర్చనందుకు ఓ ప్రబద్దుడు దారుణానికి ఒడిగట్టాడు. కామంతో మైనర్ బాలిక అని చూడకుండా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అడ్డు చెప్పిందని హత్య చేసి పరారీ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనం రేపుతోంది.
ఉత్తర ప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా సిక్రీ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన అశోక్(30) స్థానికంగానే నివాసం ఉండే 8 ఏండ్ల బాలికను మంగళవారం రాత్రి దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత మొక్క జొన్నలు ఇస్తానని చెప్పి ఎవరు లేని సమయం చూసి పంటపొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. బాలిక గట్టిగా కేకలు వేసింది.
దీంతో అశోక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మైనర్ బాలికను పొడిచి హత్య చేశాడు. అంతేకాకుండా, మృతదేహాన్ని అక్కడే పంట పొలంలో దాచిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారీ అయ్యాడు. బుధవారం ఉదయం అటుగా వచ్చిన గ్రామస్తులు పొలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో బోరున విలపించారు. జరిగిన ఘటనపై బాలిక తండ్రి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ వద్ద భైఠాయించారు.