ఎల్లుండే ఏపీ మంత్రివర్గ విస్తరణ !
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇద్దరు కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభకు పంపడంతో వారి స్థానాల్లో ఖాళీ అయిన మంత్రుల శాఖలను కొత్తవారితో భర్తీ చేసేందుకు నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే పదవులు దక్కుతాయని వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుండగా మంత్రుల శాఖలో మార్పులు ఏమీ ఉండకపోవచ్చని […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇద్దరు కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభకు పంపడంతో వారి స్థానాల్లో ఖాళీ అయిన మంత్రుల శాఖలను కొత్తవారితో భర్తీ చేసేందుకు నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే పదవులు దక్కుతాయని వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుండగా మంత్రుల శాఖలో మార్పులు ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే సీఎం జగన్.. ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనేది ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుంళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు అవకాశం దక్కొచ్చని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఎవరికి దక్కేది ప్రభుత్వం మంగళవారం అధికారికంగా వెల్లడించనుంది.