రహదారుల పునరుద్ధరణతో అభివృద్ధి వేగవంతం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి : రహదారుల పునరుద్ధరణతో అభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి నాగర్ కర్నూల్ అంతర్ జిల్లా రహదారి లోని బ్రిడ్జి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్ల వ్యయంతో బ్రిడ్జి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రహదారుల పునరుద్ధరణ పనులతో అభివృద్ధి వేగవంతం అవుతుందని […]
దిశ, వనపర్తి : రహదారుల పునరుద్ధరణతో అభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి నాగర్ కర్నూల్ అంతర్ జిల్లా రహదారి లోని బ్రిడ్జి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్ల వ్యయంతో బ్రిడ్జి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రహదారుల పునరుద్ధరణ పనులతో అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు, సౌకర్యవంతంగా విశాలంగా 36 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.