వేద పాఠశాల విద్యార్థుల మృతిపై మంత్రి వెల్లంపల్లి విచారం

దిశ, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకుడు కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత గవర్నర్ బీబీ హరిచందన్, మంత్రులు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావులు విచారం వ్యక్తం చేసారు. అయితే శనివారం ఉదయం ఆరుగురు మృత దేహాలను గుంటూరు జీజీహెచ్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు […]

Update: 2021-12-11 09:52 GMT

దిశ, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకుడు కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత గవర్నర్ బీబీ హరిచందన్, మంత్రులు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావులు విచారం వ్యక్తం చేసారు. అయితే శనివారం ఉదయం ఆరుగురు మృత దేహాలను గుంటూరు జీజీహెచ్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కలిసి పరిశీలించారు. భౌతిక‌కాయాల‌కు నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహాయం అందజేత

మాదిపాడు విషాద ఘటనలో మరణించిన వేద విద్యార్థుల కుటుంబాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ఆర్థిక సహాయం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు చొప్పున అందజేసింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల సూచన మేరకు పీఠం ప్రతినిధులు డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ, కోనూరు సతీష్ శర్మ నగదు రూపంలో మృతుల కుటుంబాలకు అందజేసారు. ఈ ప్రమాదంలో మరణించిన వేద విద్యార్థుల గురువుల కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేయనున్నారు.

Tags:    

Similar News