‘డబుల్’ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: తలసాని

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల ప్రగతిపై మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే […]

Update: 2020-12-30 05:29 GMT

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల ప్రగతిపై మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు కొన్ని చోట్ల ఉన్న సమస్యలను రెవెన్యూ, హౌసింగ్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరి కారణంగా నిర్మాణ పనులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అలాంటి వారి పై అవసరమైతే న్యాయపరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. అర్హులకు లబ్దిదారుల సమక్షంలోనే ఇండ్లను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News