‘రైతులతో గోక్కున్నోడు ఎవడూ బాగుపడలేదు’

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను ఆయన వ్యతిరేకించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా బిల్లు ఉందన్నారు. బీజేపీ నేతలు అడ్డు అదుపు లేదని భ్రమల్లో ఉన్నారన్నారు. జమ్మూకాశ్మీర్, చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం రాగానే మైలేజీ వస్తుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కష్ట […]

Update: 2020-09-21 03:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను ఆయన వ్యతిరేకించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా బిల్లు ఉందన్నారు. బీజేపీ నేతలు అడ్డు అదుపు లేదని భ్రమల్లో ఉన్నారన్నారు.

జమ్మూకాశ్మీర్, చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం రాగానే మైలేజీ వస్తుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో కనీసం తెలంగాణను ఆదుకోలేదని ఆయన మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే చట్టంపై రాజ్యసభలో కనీస చర్చ జరగనివ్వలేదని దుయ్యబట్టారు. కరోనా టైంలో బీజేపీ నేతలు ప్రభుత్వాలను కూల్చే పని చేసిందని మండిపడ్డారు. రైతులతో గోక్కున్నోడు ఎవడూ బాగుపడలేదని, బీజేపీ అనుభవిస్తుందని హెచ్చరించారు.

Tags:    

Similar News