మంత్రి తలసాని సినన్నకు ప్రేమతో..
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ముశం శ్రీనివాస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్కు హుజురాబాద్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాస్కు శానిటైజర్ పోస్ట్ చేశారు. మంత్రి తలసాని సినన్న మీద ప్రేమతో, కరోనా సమయం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ రోజూ చూసినా మాస్కు లేకుండా కనబడుతున్నారని తెలిపారు. మంత్రి ఇలా తిరగడం వల్ల మీకు ఏదైనా జరగకూడనిది జరిగితే, మేము భరించలేమని అన్నారు. అటుకులు బువ్వ తిని […]
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ముశం శ్రీనివాస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్కు హుజురాబాద్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాస్కు శానిటైజర్ పోస్ట్ చేశారు. మంత్రి తలసాని సినన్న మీద ప్రేమతో, కరోనా సమయం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ రోజూ చూసినా మాస్కు లేకుండా కనబడుతున్నారని తెలిపారు. మంత్రి ఇలా తిరగడం వల్ల మీకు ఏదైనా జరగకూడనిది జరిగితే, మేము భరించలేమని అన్నారు.
అటుకులు బువ్వ తిని ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ఇంకా సేవలు చేయాల్సిన అవసరం ఉందని ఈ మాస్కులు పంపించామని తెలిపారు. శానిటైజర్, మాస్కును తప్పక వాడతారని ప్రేమగా ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలారా మీ మీ ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులు మాస్కు కొనుక్కునే స్థోమత లేని వారు చాలా మందే ఉన్నారు. వారికి మనమే మాస్కులు పంపించి మన ప్రజా ప్రతినిధులను కరోనా బారిన పడకుండా కాపాడుదామని పిలుపునిచ్చారు. పది మందికి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే, ఇలా పది మంది లో నవ్వుల పాలు కావడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.