గ్రేటర్ పీఠాన్ని సింపుల్ గా గెలుచుకున్నాం
దిశ,వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా నియమితులయ్యారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంఐఎంకు ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ను తిరస్కరించిన ఎంఐఎం.. టీఆర్ఎస్ పార్టీ చెందిన నేతల్ని మేయర్‌గా, డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇస్తూ మద్దతు […]
దిశ,వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా నియమితులయ్యారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంఐఎంకు ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ను తిరస్కరించిన ఎంఐఎం.. టీఆర్ఎస్ పార్టీ చెందిన నేతల్ని మేయర్‌గా, డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇస్తూ మద్దతు పలికింది. దీంతో టీఆర్‌ఎస్ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈఎంపికపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు. సింపుల్ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పథకాలతో ఎంఐఎంకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ ఏమైనా అంటరాని పార్టీనా.. దేశంలో అధికారంలో ఉన్నారు కదా అని గుర్తు చేశారు. ఎంఐఎం.., టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తే తప్పేంటని అన్నారు. ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తే బీజేపీ ఓర్చుకోలేకపోయిందని తలసాని ఎద్దేవా చేశారు.