కేంద్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

దిశ, ముషీరాబాద్: తెలంగాణలో వరదల పరిస్థితి చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు కానీ కేంద్రం మాత్రం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన అరుంధతీ నగర్ బస్తీ వాసులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి పది వేల రూపాయల నగదు సహాయాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో ఉన్న సీఎం స్పందించి డబ్బులు ఇచ్చారని తెలిపారు. కేంద్రం […]

Update: 2020-10-21 08:28 GMT

దిశ, ముషీరాబాద్:
తెలంగాణలో వరదల పరిస్థితి చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు కానీ కేంద్రం మాత్రం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన అరుంధతీ నగర్ బస్తీ వాసులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి పది వేల రూపాయల నగదు సహాయాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో ఉన్న సీఎం స్పందించి డబ్బులు ఇచ్చారని తెలిపారు. కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నాయకులు కట్టగట్టుకొని ఢిల్లీకి పోయి తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. ఇదంతా జరగడానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. అక్రమ అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News