ప్రతీ విషయం సీఎం దృష్టిలో ఉంది.. బండికి తలసాని కౌంటర్!

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖ తొలగింపు తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. తొలిసారిగా ఏ శాఖ లేని మంత్రిగా ఈటల ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే, ఈరోజు సీఎస్ నివేదిక అందించిన మరుక్షణం ఈటల రాజీనామా మంత్రి పదవికి చేయనున్నరా లేదా ముఖ్యమంత్రే బర్తరఫ్ చేస్తారా అన్న దానిపై పలు ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. ఒక్క మంత్రి సరే, […]

Update: 2021-05-01 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖ తొలగింపు తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. తొలిసారిగా ఏ శాఖ లేని మంత్రిగా ఈటల ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే, ఈరోజు సీఎస్ నివేదిక అందించిన మరుక్షణం ఈటల రాజీనామా మంత్రి పదవికి చేయనున్నరా లేదా ముఖ్యమంత్రే బర్తరఫ్ చేస్తారా అన్న దానిపై పలు ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. ఒక్క మంత్రి సరే, టీఆర్ఎస్‌లో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి, కబ్జా ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కరోనాపై ముఖ్యమంత్రికి పట్టింపు లేదని, సమీక్ష చేయడం లేదని విమర్శించారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై ముఖ్యమంత్రి సీరియస్గా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశాఖనే ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నారని చెప్పారు. ఇంతకంటే శ్రద్ధ తీసుకోవడం ఏముంటుందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు సీఎం పరిధిలో ఉన్నాయని తలసాని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా బండి సంజయ్ ఏమన్న సత్యహరిశ్చంద్రుడా అని ప్రశ్నించారు. సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి కరోనా వచ్చినా ఆయన పనిచేస్తున్నారని, ప్రతిరోజూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారని, సమీక్ష కూడా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News