క్వాలిటీ పరంగా రాజీ లేదు: తలసాని
దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం జలాలు దక్షిణ తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కూడా పారుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని మానేరు డ్యాంలలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ లు చేప పిల్లలను జార విడిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఎంఎండీ, ఎల్ంఎండీలకు నీరు వచ్చి చేరిందన్నారు. మిడ్ మానేరులో 30 లక్షల చేప పిల్లలు వదిలామని, […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం జలాలు దక్షిణ తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కూడా పారుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని మానేరు డ్యాంలలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ లు చేప పిల్లలను జార విడిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఎంఎండీ, ఎల్ంఎండీలకు నీరు వచ్చి చేరిందన్నారు. మిడ్ మానేరులో 30 లక్షల చేప పిల్లలు వదిలామని, రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల చేప పిల్లలు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని ప్రకటించారు.
గత ప్రభుత్వాలు మత్స్యకారులు అంటే ఆంధ్ర వైపే అన్నట్టుగా చూపారని, సీఎం కేసీఆర్ అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండడం వల్లే ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ జరుగుతోందని, కేటీఆర్ సారథ్యంలో ఈ నెల 12న సమావేశం జరగనుందని ఆయన వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడడం లేదని స్పష్టం చేశారు. ఫ్రీ సీడ్ పంపిణీ దేశంలో ఎక్కడా లేదని తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే అమలవుతుందన్నారు.