జగన్ ఆలోచనలకు ప్రతి రూపమే కేంద్ర విద్యా విధానం
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోరణితో చూస్తే.. తమ ప్రభుత్వం పేదలకు హక్కుగా భావిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యా విధానంలో మెజార్టీ అంశాలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్నావే ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆలోచనలకు ప్రతి రూపంగానే కేంద్ర విద్యా విధానం ఉందన్నారు. “మా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అమలుకు కట్టుబడి ఉంది. అయితే తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోరణితో చూస్తే.. తమ ప్రభుత్వం పేదలకు హక్కుగా భావిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యా విధానంలో మెజార్టీ అంశాలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్నావే ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆలోచనలకు ప్రతి రూపంగానే కేంద్ర విద్యా విధానం ఉందన్నారు.
“మా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అమలుకు కట్టుబడి ఉంది. అయితే తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. పూర్తిగా తెలుగుమీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది” అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో మొదటి సారి ప్రి ప్రైమరీ విద్యను కూడా తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు.