త్వరలోనే కరోనా నుంచి బయటపడుతాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

దిశ, మహబూబ్‌నగర్: కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల కోసం తప్పా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. నిరంతర కృషి వల్లనే మహబూబ్‌నగర్ జిల్లా రెడ్ జోన్‌లోకి రాలేదని గుర్తుచేశారు. త్వరలోనే […]

Update: 2020-04-16 07:37 GMT

దిశ, మహబూబ్‌నగర్: కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల కోసం తప్పా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. నిరంతర కృషి వల్లనే మహబూబ్‌నగర్ జిల్లా రెడ్ జోన్‌లోకి రాలేదని గుర్తుచేశారు. త్వరలోనే కరోనా నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సద్దల గుండు, శెట్టి కాంప్లెక్స్ వద్ద సిబ్బంది డ్రోన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేశారు.

Tags: Minister v.srinivasgound, visit, Mahabubnagar,spray Hipocloride

Tags:    

Similar News