కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కేటీఆరే..!
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : కేసీఆర్ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు, సత్తా కేవలం కేటీఆర్ ఒక్కరికే ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలోనూ మంత్రి […]
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : కేసీఆర్ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు, సత్తా కేవలం కేటీఆర్ ఒక్కరికే ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలోనూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరికంటే ముందుగా కాబోయే సీఎం కేటీఆర్ అని పలు సందర్భాలలో ప్రస్తావించడం..
ఆ తర్వాత ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే నినాదం ఎత్తుకోవడంతో ఒకానొక సందర్భంలో కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇంతలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. లేనియెడల కఠిన చర్యలుంటాయని హెచ్చరించడంతో అందరూ సైలంట్ అయ్యారు. నాటి నుంచి కేటీఆర్ ముఖ్యమంత్రి అనే ప్రచారం కనుమరుగైంది. మరోమారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ ముఖ్యమంత్రి అనే ప్రచారాన్ని మరోసారి తెరమీదకు తెవడంతో సీఎం కేసీఆర్ ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.