ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎడతెరిపిలేకుండా గత రాత్రి నుంచి కురుతున్న వర్షం కారణంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి భారీగా నీరు చేరింది. ముఖ్యంగా పేద చెరువు ప్రాంతంలోని కాలనీలు అన్ని కూడా జలమయమయ్యాయి. వర్షం కారణంగా పట్టణంలోని రామయ్య బౌలి, క్రిస్టియన్ కాలనీ, బీకే రెడ్డి కాలనీ, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో భారీగా నీరు చేరింది. దీంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కలనీలలో పర్యటించారు. […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎడతెరిపిలేకుండా గత రాత్రి నుంచి కురుతున్న వర్షం కారణంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి భారీగా నీరు చేరింది. ముఖ్యంగా పేద చెరువు ప్రాంతంలోని కాలనీలు అన్ని కూడా జలమయమయ్యాయి. వర్షం కారణంగా పట్టణంలోని రామయ్య బౌలి, క్రిస్టియన్ కాలనీ, బీకే రెడ్డి కాలనీ, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో భారీగా నీరు చేరింది.
దీంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సహాయక చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. నీటి దారి మళ్లించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.