నిందితుడి కోసం లైఫ్ రిస్క్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని చేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమవారం మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ (36) బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్‌ను ఢీకొట్టి వేగంగా […]

Update: 2021-05-24 12:23 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని చేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమవారం మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ (36) బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్‌ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఇది గమనించిన అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు.

ఆక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరో వాహనాన్ని 3 కిలో మీటర్ల మేర చేజ్ చేసి.. చివరకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా రోడ్డు అడ్డంగా తనవాహనాన్ని ఆపివేయించారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న బొలెరో డ్రైవర్ మంత్రి కాన్వాయ్‌ని చూసి బ్రేకులేశాడు. సదరు డ్రైవర్‌కు వార్నింగ్ ఇచ్చిన మంత్రి.. అతడిని పోలీసులకు అప్పగించారు. బాధితుడిన రాజాపూర్ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపారు. మంత్రి చూపిన చొరవకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ఈ ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాస్ పరిస్థితి విషమించి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడని తెలుస్తోంది.

Tags:    

Similar News