దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పునరంకితం అవ్వాలి- మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ,వనపర్తి: భారతదేశ స్వాతంత్రం కోసం స్వాతంత్రసమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సర్వ మత సమ్మేళనానికి, దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పునరంకితం అవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో 75వ తంత్ర దినోత్సవం వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రగతి నివేదిక ను ప్రజల ముందు ఉంచారు. స్వాతంత్ర సమరయోధుల […]

Update: 2021-08-15 01:37 GMT

దిశ,వనపర్తి: భారతదేశ స్వాతంత్రం కోసం స్వాతంత్రసమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సర్వ మత సమ్మేళనానికి, దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పునరంకితం అవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో 75వ తంత్ర దినోత్సవం వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రగతి నివేదిక ను ప్రజల ముందు ఉంచారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ఆయన సన్మానించారు. ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను నిరంజన్ రెడ్డి కలెక్టర్ యాస్మిన్ భాష అందజేసారు.

అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర సమరంలో త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు వ్యవసాయ రంగానికి మొదటిస్థానం ఇస్తూ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది అని అన్నారు. జిల్లాకు సాగునీరు అందించడంతో బీడు భూములు సత్య శ్యామల మాయ్యాయని, జిల్లాకు నూతన మెడికల్ కాలేజ్ మంజూరు కావడంతో స్థల కేటాయింపు, నిర్మాణ పనులు వేగవంతమాయ్యని తెలిపారు. మత సామరస్యానికి దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. స్వతంత్ర దినోత్సవం వేడుకలలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి,జడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి,ఎస్పీ అపూర్వ రావు,అదనపు జిల్లా కలెక్టర్లు వేణుగోపాల్ అంకిత్,ప్రభుత్వ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News