పది పరీక్షలు యధావిధిగా జరుగుతాయి : ఆదిమూలపు సురేష్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ప్రచారంతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ప్రచారంతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అసెస్‌మెంట్, ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ కూడా ఇదే నిర్ణయం తీసుకోవచ్చని అంతా భావించగా, పరీక్షలు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.