రైతులకు గిట్టుబాటు ధర కలిపిస్తాం : మంత్రి
దిశ, రంగారెడ్డి: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం తండాలో వరి కోస్తున్న మహిళా రైతులను పలకరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నమన్నారు. పెండ్యాల గ్రామంలో సర్పంచ్ సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి […]
దిశ, రంగారెడ్డి: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం తండాలో వరి కోస్తున్న మహిళా రైతులను పలకరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నమన్నారు. పెండ్యాల గ్రామంలో సర్పంచ్ సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉన్న వారందరూ ముందుకు రావాలని కోరారు. ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, సొసైటీ ఛైర్మెన్ పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన దారిలో నడిచి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం మాన్సాన్‌పల్లి, దుబ్బచెర్ల గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులు అర్పించారు.
Tags : Minister Sabitha IndraReddy, inspected, crop, rangareddy, rain, formers